పవన్‌ కళ్యాణ్‌ విషయంలో అదంతా అబద్ధమేనా?

మరిన్ని వార్తలు

పవన్‌ కళ్యాణ్‌ ఇటీవలే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వస్తూ వస్తూనే ఏకంగా మూడు సినిమాలు అనౌన్స్‌ చేసేశాడు. అంతా బాగానే ఉంది. కానీ, పవన్‌ రెమ్యునరేషన్‌ బాగా పెంచేశాడంటూ టాక్‌ వినిపిస్తోంది. అక్షరాలా 50 కోట్లు తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. ‘పింక్‌’ రీమేక్‌ కోసం దిల్‌రాజు, 50 కోట్లు ఆఫర్‌ చేశాడనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. అంతే కాదు, తర్వాత క్రిష్‌తో చేస్తున్న సినిమాకీ అంతే డిమాండ్‌ చేస్తున్నాడనే టాక్‌ ఉంది. అయితే, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పవన్‌ కళ్యాణ్‌ అస్సలు రెమ్యునరేషన్‌ గురించి ఆలోచించడం లేదట.

 

నిజానికి రెమ్యునరేషన్‌ గురించి డిస్కషనే రాలేదట ఇంతవరకూ. రాజకీయాల్లోకి రాకముందే, అంటే, ‘అజ్ఞాతవాసి’ సినిమా టైంలోనే కొన్ని కమిట్మెంట్స్‌ జరిగాయట. వాటినే ఇప్పుడు పవన్‌ కంప్లీట్‌ చేస్తున్నాడట. అయితే, సినిమాలు అనౌన్స్‌ అయ్యాకా క్రియేట్‌ అవుతున్న బజ్‌ని దృష్టిలో పెట్టుకుంటే, 50 కోట్లు అనేది చిన్న విషయమే కావచ్చు. ఇదిలా ఉంటే, ఈ మూడు సినిమాలతో పాటు, ఇంకో రెండు లైన్‌లో ఉన్నాయట. దర్శక, నిర్మాతల ముందు పవన్‌ ఒక్కటే డిమాండ్‌ పెడుతున్నాడట. వీలైనంత వేగంగా సినిమాల నిర్మాణం జరగాలి అనేది ఒక్కటే ఆ డిమాండ్‌ అట. అదీ సంగతి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS