ఈవెంట్‌లో సందడి చేయడం వేరు. వీకెండ్ ఎపిసోడ్స్‌ని నడిపించడం వేరు. వీక్ మొత్తం హౌస్‌లో 15 మంది కంటెస్టెంట్స్ తమ తమ తీరును ఏ విధంగా చూపించారో అనే విషయంపై పూర్తిగా అవగాహన ఉండడమే కాదు, వారిని ఎలా ట్యాకిల్ చేయాలో కూడా హోస్ట్‌కి తెలిసి ఉండాలి. ఇప్పుడు బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగార్జున పరిస్థితి కాస్త అటూ ఇటూగానే ఉందట. అయితే, ఆల్రెడీ నాగార్జున కన్నా వయసులో చాలా చిన్నవారైన ఎన్టీఆర్, నాని ఈ విషయంలో తమదైన శైలి చూపించారు. ఎన్టీఆర్ ఓకే. కానీ, నాని ఈ విషయమై చాలానే కామెంట్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
అయితే, అనుభవం, వయసు పరంగా, నాగార్జునకు ఇది ఏమంత పెద్ద విషయం కాకున్నా, ఎంతో కొంత కత్తి మీద సామే అని చెప్పాలి. ఈ సీజన్ హౌస్ మేట్స్ అంతా మెచ్యూర్డ్‌గా, స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. పర్‌ఫెక్ట్ గేమ్ స్ట్రాటజీతో హౌస్‌లోకి అడుగుపెట్టారు. 15 మందిలోనూ ఏ ఒక్కరూ ఎక్కువ, ఏ ఒక్కరూ తక్కువ కాదు. సో ఏ ఏ డిస్కషన్‌సని నాగ్ రైజ్ చేసినా, వాటిని ఎదుర్కొనేందుకు కంటెస్టెంట్స్‌కి ఓ ఐడియా ఉండనే ఉంటుంది. ఇప్పటికే, హేమ, రాహుల్ ఇష్యూకి సంబంధించి, నాగార్జున గారి దగ్గర తేల్చుకుందాం అంటూ ఓ అప్పీల్ రెడీ చేసి పెట్టారు.
అంతేకాదు, ఈ వారంలో మహేష్ - వరుణ్, శ్రీముఖి - హిమజ, శ్రీముఖి - రాహుల్.. ఇలా చాలానే సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి. వీటిని ఈ వీకెండ్‌లో నాగార్జున రైజ్ చేయాల్సిన అంశాలు. వీటిపై నాగ్ స్పందన ఎలా ఉండబోతోంది. హౌస్ మేట్స్‌కి ఎలాంటి సూచనలు, హెచ్చరికలు నాగార్జున నుండి అందబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.