సూపర్ స్టార్ మహేశ్ బాబు ఖాతలో మరో రికార్డ్ చేరింది. ఇది సోషల్‌మీడియా రికార్డ్ . సోషల్ మీదయా ఫాలోయింగ్‌తో కొత్త రికార్డు సృష్టించాడు మహేష్ . అత్యధిక మంది ఫాలోవర్స్‌ను కలిగిన ఏకైక సౌత్ ఇండియన్ హీరోగా మహేశ్ నిలిచాడు.
ఫేస్‌బుక్ , ట్విటర్, ఇన్‌స్టా ల్లో మహేశ్ ఏకంగా 10 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మూడు ప్లాట్‌ఫామ్‌లలో కోటిని క్రాస్ చేసిన ఏకైక సౌత్ ఇండియన్ హీరోగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఫాలోవర్స్ విషయంలో ఫేస్‌బుక్, ట్విటర్‌లలో 10 మిలియన్లను ఎప్పుడో దాటేసిన మహేశ్ తాజాగా ఇన్‌స్టాలోనూ కోటికి చేరుకున్నాడు. దీంతో ఈ మూడింటిలో ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్న ఏకైక సౌత్ ఇండియన్ స్టార్‌గా మహేశ్ నిలిచాడు.
ఇక సినిమాల విషయానికొస్తే మహేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది