నాని తొలి పాన్ ఇండియా సినిమా దసరా. ఈ సినిమా విషయంలో మొదటి నుంచి చాలా జాగ్రత్తలు వహించాడు నాని. తనని తాను కొత్తగా ప్రజంట్ చేసుకోవాలని తపించాడు. అందుకే ఎన్నడూ లేని మాస్ క్యారెక్టర్ లో తనని తాను మలుచుకున్నాడు. ఇక పాన్ ఇండియా సినిమా అంటే టైటిల్ కి కూడా న్యాయం చేశాడు.
చాలా మంది కేవలం నామమాత్రనికే పాన్ ఇండియా సినిమాని అని వేసుకుంటున్నారు. తెలుగులో తప్పితే మరో భాషలో సినిమా విడుదల కాదు. ''పాన్ ఇండియా సినిమా అన్నారు.. మిగతా భాషల పరిస్థితి ఏమిటి ?'' అని అడిగితే తీరిగ్గా విడుదల చేసుకుంటామని సమాధానం ఇస్తున్నారు కొందరు. కానీ నాని కేవలం టైటిల్ కే పరిమితం కాకుండా దాదాపు అన్నీ భాషల ప్రమోషన్స్ లో తిరిగాడు.
కేవలం తనొక్కడే అన్ని ప్రమోషన్స్ కి హాజరై బజ్ క్రియేట్ చేశాడు. ఈ సినిమాకి కోసం నెల రోజుల కేవలం ప్రమోషన్స్ కే కేటాయించాడు నాని. దసరా పై బజ్ క్రియేట్ కావడానికి అదొక కారణం. మొత్తానికి తనవంతు చేయాల్సిన పనిని భాద్యతగా నిర్వహించాడు. మారా పనికి ప్రతిఫలం దసరా రిజల్ట్ ని బట్టి వుంటుంది.