'గీత‌' దాటొచ్చేసిన ప‌ర‌శురామ్‌

By iQlikMovies - May 19, 2019 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

గీతా గోవిందంతో ఓ సూప‌ర్ హిట్ కొట్టాడు ప‌ర‌శురామ్‌. దాని త‌ర‌వాత గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా చేయ‌డానికి ఒప్పందం కుదిరింది. ప‌ర‌శురామ్ అడ్వాన్సు కూడా తీసుకున్నాడు. మ‌రోవైపు మ‌హేష్ బాబుకీ అడ్వాన్సు ఇచ్చింది గీతా ఆర్ట్స్. దాంతో మ‌హేష్ - ప‌ర‌శురామ్ కాంబినేష‌న్ సెట్ట‌యిపోయింది. ఇటీవ‌ల ప‌రశురామ్ మ‌హేష్‌ని క‌ల‌సి క‌థ కూడా వినిపించాడు. అనిల్ రావిపూడి సినిమా పూర్త‌యిన వెంట‌నే ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌బోతోంది. అంత‌లోనే ఓ చిన్న మార్పు. ఈ కాంబినేష‌న్‌లో సినిమా గీతా ఆర్ట్స్ లో లేద‌ట‌.

 

మ‌రో బ్యాన‌ర్‌లో సినిమా ఉంటుంద‌ని, మైత్రీ మూవీస్ ఈ సినిమాని టేక‌ప్ చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, మహేష్ త‌న సొంత సంస్థ‌లోనూ ఈ సినిమా చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఇటు ప‌ర‌శురామ్‌కీ, అటు మ‌హేష్‌కీ అడ్వాన్సులు ఇచ్చేసిన గీతా ఆర్ట్స్ ఈ సినిమాని ఎందుకు వ‌దులుకోవాల‌ని చూస్తోంద‌న్న‌ది పెద్ద క్వ‌శ్చన్ మార్క్‌. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తోంది. అప్పుడేమైనా క్లారిటీ వ‌స్తుందేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS