ఆ సినిమాలపైనే దృష్టి పెట్టిన త్రిష!

మరిన్ని వార్తలు

ఒకప్పుడు గ్లామర్‌ తారగా వెలుగొందిన ముద్దుగుమ్మ త్రిష ఇప్పుడు హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్‌ ఇస్తోంది. అలాగని మొత్తానికి హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌నే ఎంచుకుంటోందా.? అంటే అదేం కాదని అంటోంది. ఈ మధ్య త్రిష నటించిన '96', 'పేటా' చిత్రాలు మంచి విజయం అందుకున్నాయి. దాంతో త్రిష కెరీర్‌ మరోసారి టర్న్‌ అయ్యింది. ఇదే ట్రెండ్‌ని త్రిష తెలుగులోనూ కొనసాగించాలనుకుంటోందట.

 

తెలుగులో కూడా మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తోందట. ఈ మధ్య ఓ బిగ్‌ ఆఫర్‌ త్రిష తలుపు తట్టిందనీ తెలుస్తోంది. తెలుగులో ఓ సీనియర్‌ హీరో సినిమా కోసం త్రిషను అడిగారనీ కోలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ మంచి అవకాశంతో తెలుగు సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న త్రిషకు ఈ అవకాశం కలిసొచ్చేదే అనాలి. ఇదిలా ఉంటే, త్రిషకు తెలుగులోనూ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌లో ఛాన్స్‌లొస్తున్నాయని టాక్‌ వినిపిస్తోంది.

 

ఒకవేళ అదే నిజమైతే, హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌లో తెలుగులో జేజమ్మ తర్వాత త్రిష రెండో స్థానం ఆక్రమించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. కానీ, ఇప్పటికే తమిళంలో ఆ తరహా చిత్రాల్లో నటించిన త్రిష పెద్దగా సక్సెస్‌ సాధించింది లేదు. మరి తెలుగులో ఏం సాధిస్తుందో కానీ, ఒకసారి రేస్‌లోకి దూకితే కానీ తెలీదు. ఇదిలా ఉంటే తమిళంలో రెండు హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌లో త్రిష నటిస్తోంది. ఈ రెండూ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ మూవీసేనట. పక్కా యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమాలు రూపొందుతున్నాయట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS