మ‌హేష్ మెచ్చుకున్నాడ‌హో...

By Gowthami - December 17, 2019 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

ఈమ‌ధ్య మ‌హేష్‌బాబు పొగ‌డ్త‌ల కార్య‌క్ర‌మంలో దిగిపోతున్నాడు. త‌న‌కో సినిమాన‌చ్చితే.. ట్విట్ట‌ర్‌లో చిత్ర‌బృందానికి అభినంద‌న‌లు తెలుపుతున్నాడు. మ‌హేష్ ట్వీట్లు ఆయా సినిమాల‌కు కొత్త ప్ర‌మోష‌న్ల‌ను తీసుకొస్తున్నాయి. తాజాగా మ‌హేష్ `వెంకీ మామ‌`ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా న‌టించిన చిత్ర‌మిది. బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శుక్ర‌వారం ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

 

ఈ సినిమా ని త‌న హోం థియేట‌ర్లో చూసిన మ‌హేష్‌.. చిత్ర‌బృందాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. సినిమా ఆద్యంతం త‌న‌ని అల‌రించింద‌ని, వెంకీ - నాగ‌చైత‌న్య‌ల కెమిస్ట్రీ త‌న‌కు న‌చ్చింద‌ని, బాగా ఎంట‌ర్‌టైన్ చేసింద‌ని చెప్పుకొచ్చాడు మ‌హేష్‌. ఈ ట్వీట్ చిత్ర‌బృందాన్ని సంతోషంలో ముంచెత్తింది. వెంకీతో మ‌హేష్‌కి ఎంతో అనుబంధం ఉంది. ఇద్ద‌రూ క‌లిసి సీత‌మ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేశారు, అప్ప‌టి నుంచి ఈ బంధం బ‌ల‌ప‌డుతూనే ఉంది. ఆ అనుబంధం తో ఈ ట్వీట్‌తో మ‌రింత ధృడ‌ప‌డింద‌నే అనుకోవాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS