రష్మిక అదరగొట్టినా.. పూజాదే పై చేయి.!

మరిన్ని వార్తలు

'సరిలేరు.. నీకెవ్వరూ..', 'అల వైకుంఠపురములో..' రెండు సినిమాలూ సంక్రాంతికి నువ్వా.? నేనా.? అనే స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లోనూ అదే పోటీ నెలకొంది. తాజాగా 'సరిలేరు..' నుండి 'హి ఈజ్‌ సో క్యూట్‌' సాంగ్‌ రిలీజ్‌ చేశారు. హీరోని, హీరోయిన్‌ టీజ్‌ చేసే సాంగ్‌ ఇది. ఈ సాంగ్‌లో రష్మిక వేసిన డాన్స్‌ స్టెప్పులు యూత్‌లో కిర్రాకు పుట్టిస్తున్నాయి. ఇంతవరకూ 'సరిలేరు..' నుండి రష్మికకు సంబంధించి ఏ ఇన్‌ఫామేషన్‌ లేదు. కానీ, ఈ సాంగ్‌తో రష్మికను ఓ రేంజ్‌లో ప్రమోట్‌ చేశాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఈ సాంగ్‌ ఇప్పుడు యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌ అయిపోయింది.

 

ఇదిలా ఉంటే, 'అల..' టీమ్‌ తక్కువ తింటారా.? వారు కూడా త్వరలోనే హీరోయిన్‌ పూజా హెగ్దేకి సంబంధించి 'బుట్టబొమ్మ' సాంగ్‌ రిలీజ్‌ చేయబోతున్నామని ఓ పోస్టర్‌ ద్వారా అనౌన్స్‌ చేశారు. సాంగ్‌ ఇంకా రాలేదు కానీ, రిలీజైన ఫోటోనే సెన్సేషన్‌ సృష్టిస్తోంది. రష్మికను అలా పరిచయం చేశాకా, ఇక పూజాని ఇంకెంతలా చూపిస్తారో అంటూ, ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. ఫోటోతోనే ఇంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన పూజా ఎంట్రీ 'బుట్టబొమ్మ..' సాంగ్‌తో మరో సెన్సేషన్‌ సృష్టించడం ఖాయం. త్వరలోనే ఈ సాంగ్‌ ప్రోమో విడుదల కానుంది. జనవరి 11న 'సరిలేరు..' సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, జనవరి 12 నుండి ధియేటర్స్‌లో 'అల..' టీమ్‌ సందడి చేయనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS