`ఇస్మార్ట్ శంకర్`తో భీకరమైన ఫామ్ లోకి వచ్చేశాడు పూరి జగన్నాథ్. ఇప్పుడు తన గురంతా పెద్ద హీరోలపైనే ఉంది. ప్రస్తుతం... విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తరవాత బాలీవుడ్ లో ఓ సినిమా చేయాలన్నది ప్లాన్. ఇంతలోనే మరో పెద్ద హీరోతో సినిమా ఫిక్స్ చేసి, దాన్ని కూడా ట్రాక్‌లో పెట్టాలని భావిస్తున్నాడు.
ఎట్టకేలకు... పూరి ప్రయత్నాలు ఫలించినట్టు టాక్. మహేష్‌బాబు కోసం పూరి ఓ కథని ఎప్పుడో సిద్ధం చేశాడు. మహేష్‌కీ వినిపించాడు.కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. ఆ తరవాత పూరి - మహేష్ మధ్య గ్యాప్ కూడా వచ్చింది. ఇప్పుడు ఆ మనస్పర్థలు కూడా తొలగిపోయాయి. మహేష్ తో చేయడానికి పూరి, పూరితో సినిమా తీయడానికి మహేష్ రెడీగా ఉన్నారు. పైగా అనిల్ సుంకర ఇటీవలే పూరికి అడ్వాన్సు ఇచ్చాడట. అనిల్ సుంకరకే మహేష్ ఓ సినిమా చేయాలి. సో... ఈ కాంబోలో సినిమా రావడం ఖాయం అనిపిస్తోంది. 2021లో ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన రావొచ్చు. మహేష్ - రాజమౌళి సినిమా కంటే ముందు... పూరి ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.