గుడ్ న్యూస్‌: మ‌హేష్‌తో రాజ‌మౌళి సినిమా ఫిక్స్‌.

మరిన్ని వార్తలు

దాదాపు ఈత‌రం అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ ప‌ని చేశాడు రాజ‌మౌళి. మ‌హేష్ బాబుతో మాత్రం చేయ‌లేదు. మ‌హేష్ కూడా రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో వెయిటింగ్‌. ఈ కాంబో చూడాల‌ని యావ‌త్ సినీ ప్ర‌పంచం కోరుకుంటోంది. ఇప్పుడు అందుకు ముహూర్తం ఖ‌రారైంది. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` త‌ర‌వాత రాజ‌మౌళి మ‌హేష్‌తో సినిమా చేయ‌బోతున్నారు.

 

ఈ విష‌యాన్ని రాజ‌మౌళినే స్వ‌యంగా చెప్పారు. దుర్గా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నుంది. 2021 జ‌న‌వ‌రిలో ఆర్‌.ఆర్‌.ఆర్ విడుద‌ల కానుంది. ఆ వెంట‌నే మ‌హేష్ తో సినిమా మొద‌లైపోతుంది. ఎంత కాద‌న్న 2021 వేస‌విలో ఈ కాంబోలో సినిమా ప‌ట్టాలెక్క‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ప‌ర‌శురామ్ తో ఓ సినిమా చేస్తున్నాడు మ‌హేష్‌. ఆ త‌రవాత రాజ‌మౌళితో ఆయ‌న ఫిక్స్ అయిపోవొచ్చు. ఈ సినిమానీ రాజ‌మౌళి పాన్ ఇండియా ప్రాజెక్టుగా మ‌లిచే అవ‌కాశం ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS