మ‌హేష్‌కి ఎంతో.. చ‌ర‌ణ్‌కీ అంతేనా?

By Gowthami - March 20, 2020 - 17:13 PM IST

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో అత్య‌ధిక పారితోషికం తీసుకునే క‌థానాయ‌కుడు ఎవ‌రంటే.. ట‌క్కుమ‌ని మ‌హేష్ బాబు పేరు చెప్పేస్తారు. ఇటీవ‌ల ఆయ‌న ఓ సినిమాకి గానూ 53 కోట్ల పారితోషికం తీసుకున్నారు. అదీ మ‌హేష్ స్టామినా. చిరంజీవి 152వ చిత్రంలో మ‌హేష్ బాబు నటించ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అందుకు గానూ రోజుకి కోటి రూపాయ‌ల పారితోషికం ఇవ్వ‌డానికి నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది. అయితే ఈ ఆఫ‌ర్ మ‌హేష్ చేజారి పోయింది. మ‌హేష్ చేయాల్సిన పాత్ర‌ని చ‌ర‌ణ్ చేస్తున్నాడు. మ‌హేష్‌కి ఎంత పారితోషికం అయితే కోడ్ చేశారో, అంతే మొత్తం చ‌ర‌ణ్‌కి ఇవ్వ‌బోతున్నార్ట‌.

 

నిజానికి మ‌హేష్ - చ‌ర‌ణ్ ఇద్ద‌రి స్థాయి, పారితోషికం ఒక‌టి కాదు. అయినా స‌రే.. మ‌హేష్ కి ఇస్తాన‌న్న పారితోషికం... చ‌ర‌ణ్‌కి బ‌ద‌లాయిస్తున్నారు. దానికి కొన్ని కార‌ణాలున్నాయి. ఈ చిత్రానికి కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు నిర్మాత‌లు. అయితే పెట్టుబ‌డి అంతా మాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌దే. బ్యాన‌ర్ మాత్రం చ‌ర‌ణ్‌ది. చ‌ర‌ణ్ బ్యాన‌ర్ తోడ‌వ్వ‌డం వ‌ల్ల ఈ సినిమాకి క్రేజ్ పెరుగుతుంది. ఒక‌వేళ అనుకోని న‌ష్టాలు వ‌చ్చినా... ఆదుకోవ‌డానికి చిరు, చ‌ర‌ణ్ ఇద్ద‌రూ ముందుకొస్తారు. ఆ ధీమాతోనే చిరంజీవికీ, చ‌ర‌ణ్‌కి అడిగినంత పారితోషికం ఇస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS