ఈమధ్య మహేష్ బాబు క్లాసీ పాత్రలకే పరిమితమైపోయాడు. తన నుంచి మాస్ కోణం ఇటీవల కాలంలో చూడలేదు. ఇప్పుడు ఆ కోరిక తీరబోతోంది. మహేష్‌బాబు కథానాయకుడిగా - వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. మహర్షి తరవాత వీరిద్దరూ కలిసి పనిచేయబోయే సినిమా ఇది. కథ కూడా సిద్ధమైపోయింది. ఇందులో మహేష్ బాబు గ్యాంగ్ స్టర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. వంశీ పైడిపల్లిపై హాలీవుడ్ సినిమాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ సినిమా కూడా ఓ హాలీవుడ్ చిత్రానికి స్ఫూర్తే అని తెలుస్తోంది. స్టైలీష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని రూపొందిస్తారని సమాచారం. 2020 వేసవిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.