'సరిలేరు..'కు 'ఒక్కడు' సెంటిమెంట్‌!

మరిన్ని వార్తలు

శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న 'సరిలేరు నీకెవ్వరు..' సినిమాకి ఓ సెంటిమెంట్‌ అద్దుతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కోసం కర్నూల్‌ ల్యాండ్‌ మార్క్‌ కొండారెడ్డి బురుజును రామోజీ ఫిలిం సీటీకి తెచ్చేశారు. అవునండీ కొండారెడ్డి బురుజు సాక్షిగా ఓ భారీ సెట్‌ని రూపొందిస్తున్నారట. ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎ.ఎస్‌.ప్రకాష్‌ సారధ్యంలో కొండారెడ్డి బురుజును తలపించేలా ఓ సెట్‌ని ఏర్పాటు చేశారు.

 

అక్కడే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 16 ఏళ్ల క్రితం 'ఒక్కడు' సినిమా కోసం కొండా రెడ్డి బురుజు సెట్‌లో ఓ యాక్షన్‌ సీన్‌ చిత్రీకరించారు. ఆ సీన్‌ సూపర్‌ హిట్‌. ఆ సినిమా మహేష్‌ కెరీర్‌లోనే సూపర్‌ డూపర్‌ హిట్‌. ఆ సెంటిమెంట్‌తోనే మళ్లీ ఇన్నాళ్ల తర్వాత మహేష్‌బాబు నటిస్తున్న 'సరిలేరు నీక్వెరు..' సినిమా కోసం అంతకు మించి భారీ స్థాయిలో కొండారెడ్డి బురుజు సెట్‌ని ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఈ సెట్‌ కూడా సినిమాకి హైలైట్‌ అవుతుందని భావిస్తున్నారు.

 

అనిల్‌రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సరిలేరు నీకెవ్వరు..' చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. చాలా కాలం తర్వాత సీనియర్‌ నటి విజయ శాంతి ఈ సినిమాలో నటిస్తున్నారు. దిల్‌రాజుతో కలిసి మహేష్‌బాబు స్వీయ నిర్మాణంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS