మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `సర్కారు వారి పాట`. కీర్తి సురేష్ కథానాయిక. అమెరికాలో తొలి షెడ్యూల్ ప్లాన్ చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల అమెరికా షెడ్యూల్ కాన్సిల్ అయ్యింది. ఇప్పుడు దుబాయ్‌లో ఆ షెడ్యూల్ నిర్వహించేందుకు చిత్రబృందం సమాయాత్తం అవుతోంది. ఈ నెల 25 నుంచి దుబాయ్‌లో రెగ్యులర్ షూటింగ్ నిర్వహించనున్నారు.
ముందుగా హైదరాబాద్‌లో షూటింగ్ ప్లాన్ చేసినప్పటికీ, పలు కారణాల వలన టీం దుబాయ్‌కు వెళుతున్నట్టు తెలుస్తుంది. దుబాయ్‌లో దాదాపు 20 రోజుల పాటు షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. రెండో షెడ్యూల్ మాత్రం హైదరాబాద్‌లో జరుగుతుందని సమాచారం. ఈ సినిమాలో ప్రతినాయకుడెవరన్నది ఇంకా తేలలేదు. అరవింద్ స్వామి, ఉపేంద్ర లాంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ విద్యాబాలన్ సైతం ఓ పాత్రలో కనిపించనుందని సమాచారం.