తనికెళ్ల భరణి దర్శకత్వంలో `మిథునం` వచ్చింది. ఇప్పుడు మరో సినిమా కోసం ఆయన మెగా ఫోన్ పట్టనున్నారు. ఈ చిత్రంతోనే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నటుడిగా రంగ ప్రవేశం చేయబోతున్నారు. ఆల్రెడీ స్క్రిప్టు రెడీ అయిపోయింది. త్వరలోనే చిత్రీకరణ మొదలవుతుంది. ఈ చిత్రంలో సమంత, శ్రియ, టబు లాంటి కథానాయికలు నటిస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు ఈసినిమాకి టైటిల్ కూడా ఫిక్సయిపోయిందట. ఈ సినిమాకి `ఓ బాబూ` అనే టైటిల్ పెట్టారని ప్రచారం జరుగుతోంది. దర్శకేంద్రుడి తొలి సినిమా `బాబు`. ఇప్పుడు నటుడిగా మారుతున్నప్పుడు కూడా `ఓ బాబూ` అని పిలిపించుకుంటున్నారన్నమాట. ఇది ఓ రకంగా సెంటిమెంట్ అనుకోవాలి. జనార్థన మహర్షి ఈ చిత్రానికి కథ అందించారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే పాటల సిట్టింగ్ పూర్తయిపోయిందని టాక్.