సిక్స్‌ ప్యాక్‌ సూపర్‌స్టార్‌

By iQlikMovies - June 28, 2018 - 16:28 PM IST

మరిన్ని వార్తలు

'1 - నేనొక్కడినే' సినిమా టైంలో మహేష్‌బాబు సిక్స్‌ ప్యాక్‌ ట్రై చేశాడు. కానీ వర్కవుట్‌ కాలేదు. మళ్లీ ఇప్పుడు మహేష్‌ బాబు సిక్స్‌ ప్యాక్‌ ట్రై చేస్తున్నాడట. ఈ సారి కొంచెం గట్టిగా ట్రై చేస్తున్నాడట. 

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు చేయబోతున్న సినిమా కోసమే ఈ సిక్స్‌ ప్యాక్‌ ముచ్చటన్న మాట. ఇటీవల 'భరత్‌ అనే నేను' సినిమాలో స్టైలిష్‌ లుక్‌లో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించిన మహేష్‌బాబు ఇప్పుడు సిక్స్‌ ప్యాక్‌ బాడీతో రొమాంటిక్‌ స్టైల్‌ చూపించనున్నాడట. ఈ సినిమాలో ఆల్రెడీ మహేష్‌ న్యూ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఆ లుక్‌ అటూ ఇటూగా ఆల్రెడీ రివీల్‌ అయిపోయింది కూడా. 

అంతేకాదు, మహేష్‌ కాలేజ్‌ స్టూడెంట్‌గా కనిపించబోతున్నాడంటూ సెట్స్‌ నుండి లీకైన కొన్ని ఫోటోల ద్వారా తెలిసిపోయింది. అయితే తన పాత్రలో రెండు వేరియేషన్స్‌ని చూపించనున్నాడట మహేష్‌. మొత్తానికి ప్రయోగాల జోలికి పోనంటూ ఈ సినిమాతో చాలా ప్రయోగాలే చేస్తున్నట్లున్నాడు మహేష్‌బాబు. 

ఈ సినిమాకి 'రాజసం' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. 'సమ్మోహనం' సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన హైద్రాబాదీ ముద్దుగుమ్మ అదితీరావ్‌ హైదరిని ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ కోసం ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ సినిమా తర్వాత మహేష్‌ సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS