మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'స్పైడర్'. లేటెస్టుగా స్పైడర్ సాంగ్ టీజర్ వచ్చింది. 'బూమ్ బూమ్' అంటూ సాగే ఈ పాటకు సంబంధించి జస్ట్ 17 సెకెన్ల నిడివిగల టీజర్‌ని విడుదల చేశారు. అంతేకాదండోయ్ పూర్తి పాటను కూడా విడుదల చేయనుంది చిత్ర యూనిట్. అది కూడా రేపే విడుదల కానుంది. జేమ్స్‌బాండ్ తరహాలో ఈ సాంగ్‌ని చిత్రీకరించినట్లు అర్థమవుతోంది. చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు టీజర్‌లో మహేష్‌బాబు. సాంగ్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉండబోతోందట. ఈ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది 'స్పైడర్'. తెలుగు, తమిళ భాషల్లో రికార్డు స్థాయిలో సినిమా అత్యంత భారీయెత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గతంలో జేమ్స్‌బాండ్ తరహా సినిమాలకు పెట్టింది పేరు. ఆయన తనయుడు, నేటితరం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ 'స్పైడర్' సినిమాతో ఆ తరహాలోనే జేమ్స్‌బాండ్ మూవీ చేస్తున్నాడనుకోవచ్చు. 'స్పైడర్' టాలీవుడ్‌లోనే మోస్ట్ స్టైలిష్ మూవీ కానుంది. అలాగే మహేష్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగానూ, కెరీర్ బెస్ట్ మూవీగానూ మిగలనుంది. ఈ నెల 9వ తేదీన మహేష్ పుట్టినరోజు సందర్భంగా 'స్పైడర్' టీజర్ విడుదలవుతుంది. ఈ సినిమాలో మహేష్‌కి విలన్‌గా తమిళ డైరెక్టర్ కమ్ హీరో ఎస్.జె.సూర్య నటిస్తున్నారు. మరో తమిళ యంగ్ హీరో భరత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారుడ. స్కై కాప్‌గా నటిస్తున్నాడు మహేష్ ఈ సినిమాలో. మహేష్‌కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.