తెలుగు సినీ పరిశ్రమలో పక్కా ప్లానింగ్‌తో సినిమాలు తెరకెక్కించే అతి కొద్దిమంది దర్శకుల్లో పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమాని ఎంత రిచ్‌గా తెరకెక్కించినా, అందులో ఎంత గ్రాండియర్ కన్పించినా, ఆ సినిమాకి పూరి తీసుకునే టైమ్ చాలా తక్కువగానే ఉంటుంది. ఈ విషయంలో టాలీవుడ్‌లోనే పూరీ స్పెషల్ అని చెప్పొచ్చు. 'పైసావసూల్' లాంటి భారీ చిత్రాన్ని సైతం పూరి పెర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకి అనుకున్న సమయానికన్నా ముందు తీసుకురావడం చిన్న విషయం కాదు. సెప్టెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా ఈ సినిమాని సెప్టెంబర్ 27న విడుదల చేద్దామనుకున్నారు. దాదాపు నెల రోజుల ముందు సినిమాని విడుదల చేయాలనుకోవడమంటే ఎంత ప్లానింగ్ ఉండాలి? ఈ మధ్య డ్రగ్స్ ఇష్యూలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొని పూరీ చాలా డిస్ట్రబ్ అయ్యారు. అంతగా డిస్ట్రబ్ అయినా కానీ అనుకున్న టైం కన్నా ముందుగానే సినిమా పూర్తి చేసిన పూరీకి హ్యాట్సాప్ చెప్పక తప్పదు మరి. దటీజ్ పూరి జగన్నాథ్. బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా స్టంపర్ పేరుతో వచ్చిన టీజర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మాస్‌కి చాలా క్యాచీగా రీచ్ అయ్యే డైలాగులతో బాలయ్య అదరగొట్టేస్తున్నారు. పూరీ మార్క్ హీరోగా బాలయ్య ఈ సినిమాలో చాలా బాగున్నారంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. బాలయ్య సరసన శ్రియ, ముస్కాన్, కైరా దత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో.