మహేష్‌తో సుక్కు ఎలాంటి సినిమా అంటే?

మరిన్ని వార్తలు

సుకుమార్‌ ఎప్పుడూ రొటీన్‌ సినిమాలు చేయడు. ఒక సినిమాకీ ఇంకో సినిమాకీ కంప్లీట్‌గా డిఫరెన్స్‌ చూపిస్తాడు. మొన్నటికి మొన్న 'రంగస్థలం' సినిమా చేశాడు. ఎవ్వరూ ఊహించని కాన్సెప్ట్‌ ఇది. టేకప్‌ చేసిన విధానం మరీ ఊహాతీతం. ఇలాంటి సుక్కు ఇప్పుడు మహేష్‌తో సినిమా చేయబోతున్నాడు. 

100 కోట్లకు పైగా ఈ సినిమా బడ్జెట్‌ అంటున్నారు. ఓ సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందనీ తెలుస్తోంది. మహేష్‌ ఇలాంటి కాన్సెప్ట్‌లకు ఎప్పుడూ టెంప్ట్‌ అవుతూ ఉంటాడు. అందుకే మహేష్‌ నుండి 'నాని', '1 - నేనొక్కడినే' తదితర చిత్రాలు వచ్చాయంటే అలాంటి ప్రయోగాలు చేయడం మహేష్‌కే చెల్లింది. అయితే 'భరత్‌' తర్వాత మహేష్‌ ప్రయోగాలు ఇప్పట్లో చేయనన్నాడు. అయినా కానీ సుకుమార్‌ చెప్పిన కాన్సెప్ట్‌ నచ్చితే, ఆ వైపుగా మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేవు. ఖచ్చితంగా సుకుమార్‌ - మహేష్‌ కాంబినేషన్‌లో మరో మ్యాజిక్‌ జరగడం ఖాయమంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. 

ప్రస్తుతం మహేష్‌బాబు 'భరత్‌ అనే నేను' సినిమా విజయోత్సాహంలో మునిగి తేలుతూనే, మరో పక్క వంశీ పైడిపల్లితో సినిమాకి సంసిద్ధమవుతున్నాడు ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా అందాల భామ పూజా హెగ్దే నటిస్తోంది. ఈ సినిమా పూర్తి కాగానే సుకుమార్‌ సినిమా పట్టాలెక్కించనున్నాడట. 'భరత్‌ అనే నేను' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా 125 కోట్లు గ్రాస్‌ సాధించినట్లు తాజాగా అందిన రిపోర్ట్స్‌ ద్వారా తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS