షాకింగ్ ట్వీట్ల‌తో చెలరేగిపోయిన మహేష్‌ బాబు.!

By iQlikMovies - October 02, 2018 - 14:58 PM IST

మరిన్ని వార్తలు

మంచి సినిమా వ‌చ్చిందంటే మెచ్చుకోవ‌డానికి మ‌హేష్‌బాబు ముందుంటాడు.  ఓ సినిమా న‌చ్చితే.. ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌శంస‌లు కురిపిస్తుంటాడు. ఓ సూప‌ర్ హిట్ సినిమాకి మ‌హేష్ ట్వీట్ చేయ‌ని సంద‌ర్భం లేదు. అయితే ఇప్పుడు 'న‌వాబ్‌' విష‌యంలో త‌న ట్వీట్ల‌తో చెల‌రేగిపోయాడు మ‌హేష్‌. 

ఈ ద‌శాబ‌ద్ద‌పు అద్భుత చిత్ర‌మ‌ని, క్లాసిక్ అని.. వీర లెవిల్లో పొగిడేశాడు. దానికీ ఓ కార‌ణం ఉంది. మ‌హేష్ మ‌ణిర‌త్నంకి వీరాభిమాని. చెన్నైలో మ‌ణిర‌త్నం సినిమాలు చూస్తూ... థియేట‌ర్లలోనే క్లాప్స్ కొట్టేసేవాడ‌ట మ‌హేష్‌. అంత‌టి అభిమాని మ‌ణిర‌త్నం నుంచి ఓ మంచి చిత్రం వ‌స్తే.. ఊరుకుంటాడా?  

అందుకే ట్వీట్ట ద్వారా మ‌ణినీ, ఆ చిత్ర‌బృందాన్నీ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తేశాడు.  ''మీరింకా ఈ సినిమా చూడ‌క‌పోతే... వెంట‌నే వెళ్లి టికెట్లు కొనుక్కుని చూడండి. ఓ అద్భుత‌మైన క్లాసిక్ చిత్రానికి సాక్ష్యంగా నిల‌వండి'' అంటూ అభిమానుల‌కు పిలుపు ఇచ్చాడు.

అన్న‌ట్టు మ‌హేష్‌తో ఓ సినిమా చేయ‌డానికి మ‌ణిర‌త్నం చాలాసార్లు ప్ర‌య‌త్నించారు. ఓసారి మ‌ణితో మహేష్ సినిమా అంటూ ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే అప్ప‌టికి మ‌ణి ఫ్లాపుల్లో ఉన్నారు. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న్ని ఎంత‌గా అభిమానించినా స‌రే, హీరోగా సినిమా చేయ‌డానికి సాహ‌సం చేయ‌లేక‌పోయాడు మ‌హేష్‌. 

ఇప్పుడు `న‌వాబ్‌`తో మ‌ణిర‌త్నంలో మ‌ళ్లీ మెరుపులు క‌నిపించాయి. ఇప్ప‌టికైనా... మ‌ణిని మ‌హేష్ న‌మ్ముతాడా??  వేచి చూడాల్సిందే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS