శర్వా ‘శ్రీకారం’ చుట్టేశాడుగా.!

మరిన్ని వార్తలు

బి.కిషోర్‌ దర్శకత్వంలో శర్వానంద్‌ నటిస్తున్న తాజా చిత్రానికి ‘శ్రీకారం’ అనే సాంప్రదాయమైన టైటిల్‌ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ రోజు శర్వానంద్‌ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. పచ్చని పొలాలు, తోటలు, వాటి మధ్యలో ట్రాక్టర్‌ నడుపుతూ, ప్లెజెంట్‌గా చిరునవ్వు చిందిస్తూ ఎంట్రీ ఇచ్చాడు శర్వానంద్‌. బ్యాక్‌ గ్రౌండ్‌లో ‘శ్రీకారం.. ’ అంటూ మిక్కి.జె.మేయర్‌ మ్యూజిక్‌ విజువల్‌ ఆహ్లాదాన్ని రెట్టింపు చేసేలా ఉంది. వ్యవసాయం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఆర్గానిక్‌ వ్యవసాయం అంటూ ఈ మధ్య నితిన్‌ ‘భీష్మ’ సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టి చూపించాడు.

ఇప్పుడు శర్వానంద్‌ తీరు చూస్తుంటే, కూడా అలాంటిదే ఏదో అనిపిస్తోంది. రైతు, పొలాలు, వాటి విశిష్టత చెప్పే కథలా తోస్తోంది. 14 రీల్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌లో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే, ‘జాను’తో ఇటీవల ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయిన శర్వానంద్‌ ఈ సినిమాతో సక్సెస్‌కి ‘శ్రీకారం’ చుడతాడేమో చూడాలి మరి. మరోవైపు కిషోర్‌ తిరుమల - శర్వానంద్‌ కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్టు సెట్‌ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS