మహేష్ బాబుకి “మోడీ” ఎఫెక్ట్!

By iQlikMovies - June 08, 2018 - 16:54 PM IST

మరిన్ని వార్తలు

భరత్ అనే నేను లాంటి ఒక బ్లాక్ బస్టర్ తరువాత యువ దర్శకుడు అయిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు తన 25వ చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ చిత్రం ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం, ఈ నెల నుండి మొదలవ్వాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ ప్రారంభానికి ఒక అవాంతరం వచ్చిపడింది. ఇంతకి ఆ అవాంతరం మరెవరో కాదు దేశ ప్రధాని నరేంద్ర మోడీ.

పూర్తి వివరాల్లోకి వెళితే, మహేష్ & కో ఈ నెల లో తమ చిత్ర షూటింగ్ డెహ్రాడూన్ లో మొదలుకావాల్సి ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని అక్కడ పర్యటించనున్నారు. దీనితో అక్కడ భద్రతా కారణాల రిత్యా షూటింగ్ లకి అనుమతి నిరాకరించారు.

ఇలా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా పైన మోడీ ఎఫెక్ట్ పడింది అని చెప్పొచ్చు. అయితే ఈ షూటింగ్  షెడ్యూల్ లో కొన్ని మార్పులు చేస్తూ వేరే షెడ్యూల్ ని ముందుగా చిత్రీకరిస్తారట.

ఇక ఈ సినిమా మహేష్-వంశీకి ఒక మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS