పవర్ స్టార్ కి తృటిలో తప్పిన ప్రమాదం

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అనుకునేరు! కాదు. ఈ వార్త కన్నడ చిత్రపరిశ్రమలో పవర్ స్టార్ గా కీర్తింపబడుతున్న పునీత్ రాజ్ కుమార్ కి సంబందించినది.

ఇక వివరాల్లోకి వెళితే, నటసార్వభౌమ అనే చిత్ర షూటింగ్ పూర్తిచేసుకుని బెంగుళూరుకి తిరిగి ప్రయాణం అవుతుండగా మార్గమధ్యంలో టైర్ కి పంచర్ అవ్వడం తో ఆయన కారు అదుపుతప్పి డివైడర్ ని బలంగా గుద్దుకున్నది. అయితే ఆ సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకుని ఉన్న కారణంగా ఎటువంటి గాయాలు కాలేదు.

ఈ విషయం జరిగిన కొద్దిసేపటికే కర్నాటక మొత్తం పాకిపోయింది, దీనితో అభిమానులు సైతం ఆయన ఎలా ఉన్నారు? యాక్సిడెంట్ లో ఏవైనా దెబ్బలు తగిలాయా అన్న ఆందోళనలో ఉండగా- “ పునీత్ రాజ్ కుమార్ కి ఏమి కాలేదు అంటూ ఒక అధికారిక ప్రకటన వెలువడింది.

 

దీనితో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇది జరిగిన సంగతి...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS