‘మహర్షి’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన వంశీ పైడిపల్లి ` మహేష్ బాబు కాంబినేషన్‌లో మరో సినిమా రావల్సి ఉందన్న సంగతి తెలిసిందే. ‘మహర్షి’ తర్వాత మహేష్‌బాబు సుకుమార్‌తో సినిమా చేయాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల అనిల్ రావిపూడితో ‘సరిలేరు నీకెవ్వరూ..’ సినిమా చేసి, హిట్ కంటిన్యూ చేసేశారు. ఇక తదుపరి మహేష్, వంశీ పైడిపల్లి కాంబో మూవీ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా కూడా కొన్ని టెక్నికల్ రీజన్స్‌తో వాయిదా పడింది. వంశీ ప్లేస్‌లోకి పరశురామ్ వచ్చి చేరారు. దాంతో వంశీకి మహేష్ హ్యాండిచ్చేశాడంటూ ప్రచారం జరిగింది. కానీ, వంశీతో మహేష్ సినిమా ఖచ్చితంగా ఉంటుందట.
లాక్‌డౌన్ ఎత్తేయగానే, పరశురామ్ సినిమాని పట్టాలెక్కించే యోచనలో మహేష్ ఉన్నాడు. ఆ తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా ఉండబోతోందనీ ఫిలిం వర్గాల్లో తాజా గుసగుస. మరి ఆ మంచి తరుణం ఎప్పటికి వచ్చేనో కానీ, వంశీ పైడిపల్లి, మహేష్ కోసం ఎప్పుడో కథ సిద్ధం చేసేశాడు. అనూహ్యంగా మధ్యలోకి పరశురామ్ వచ్చి చేరకపోయుంటే, ఈ పాటికి ఈ ప్రాజెక్ట్‌పై ఓ ఐడియా వచ్చి ఉండేది కూడా. ఏది ఏమైతేనేం, ఈ కాంబోలో మూవీ అయితే కన్‌ఫామ్ అని ప్రస్తుతానికి తేలిపోయింది. ఇక, ఆ ప్రాజెక్ట్ ఎప్పటికి సెట్స్ మీదికెళ్లనుందో చూడాలిక.!