ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్‌ఖాన్. బాలీవుడ్ కండలవీరుడిగా మనోడికి పిచ్చ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌కే బోలెడంత అమ్మాయిలు సల్మాన్‌తో ఇట్టే ప్రేమలో పడిపోతుంటారు. కానీ ఎందుకో ఎక్కువ కాలం సల్మాన్‌తో మనలేరు ముద్దుగుమ్మలు. అలా ఆయన ప్రేమ ఊయలలో ఊగిసలాడిన ముద్దుగుమ్మలెందరో. లెక్కేయాలంటేనే కష్టమిప్పుడు. సల్లూ భయ్యా పెళ్లెప్పుడయ్యా.. అంటూ అందరూ ఆయన పెట్టే పప్పన్నం కాదులెండి.. మటన్ బిర్యానీ కోసం ఎదురు చూస్తున్నారు కానీ, ఆ ఎదురు చూపులు ఎదురు చూపుల్లానే ఉండిపోతున్నాయి.
ఆయన మాత్రం పెళ్లి వైపు అస్సలు కాసింతైనా దృష్టి పెట్టడం లేదు. ఈ మధ్య 'నాకేమో పిల్లలు కావాలి.. ఆ పిల్లలకు తల్లి కావాలి..' అనే ఓ అర్ధమయ్యీ అర్ధం కాని స్టేట్‌మెంట్ ఒకటిచ్చాడు. ఆ స్టేట్‌మెంట్‌లోని అర్ధం ఆయనకే తెలియాలనుకోండి. కాసేపు సల్లూ భాయ్ బ్రహ్మచర్యాన్ని భంగం చేసే విషయం పక్కన పెడితే, తాజా ఫోటో చూస్తున్నారుగా.. వావ్..! సల్లూ భయ్యా ఏంటీ స్ట్రచ్ అనుకుని ఆశ్చర్యపోతున్నారు కదా. అదే ఆయన ఫిట్‌నెస్ లెవల్స్. ఫిట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్ సల్మాన్‌ఖాన్.
ఎంత కేరాఫ్ అయితే మాత్రం, మరీ ఫిఫ్టీ ఇయర్స్‌లో ఈ ఫిట్‌నెస్ అంటే ఆ వయసులో ఉన్న వారు కొందరికి జలస్‌గానే ఉంటుంది కదా. అదే జలస్ కొందరు ఫీలవుతున్నారు. ఆయన ఫ్యాన్స్ మాత్రం సల్లూ భాయ్‌ని పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు. ఆ వయసులో ఏకంగా బారెడు పొడవున్న సోఫాకి బరా బర్ స్ట్రెచ్ ఇచ్చిన సల్లూ భాయ్ కమిట్మెంట్‌కి జైకొట్టాల్సిందే బాబూ.