మరో యాక్షన్ సినిమాకు అక్కినేని హీరో.

మరిన్ని వార్తలు

ఓకే అక్కినేని నాగార్జున ఈమధ్య వరస ఫ్లాపులతో కాస్త డీలా పడ్డారు. దీంతో కొత్త ప్రాజెక్టుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' సినిమా పట్టాలెక్కుతుందని అనుకున్నారు కానీ ఆ సినిమా స్క్రిప్ట్ నాగ్ ఆశించిన స్థాయిలో రెడీ కాకపోవడంతో పక్కన పెట్టారని అంటున్నారు. అయితే ఈమధ్య ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు పచ్చ జెండా ఊపారని వార్తలు వినిపించాయి. తాజాగా ఈ సినిమాలో నాగ్ పాత్ర గురించి ఆసక్తకరమైన అప్డేట్ బయటకు వచ్చింది.

 

ఈ సినిమాలో నాగ్ ఓ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో నటిస్తారట. ఆయన గతంలో మిలిటరీ ఆఫీసర్ గా, రా ఏజెంట్ గా పని చేసి ఉంటారని సమాచారం. సినిమా పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుందట. దర్శకుడు ప్రవీణ్ సత్తారు 'పీఎస్వీ గరుడవేగ' సినిమాలో డా.రాజశేఖర్ ను ఎంతో పవర్ఫుల్ గా చూపించారు. మరి ఈ సినిమాలో నాగార్జునను ఎలా ప్రెజెంట్ చేస్తారో వేచి చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని అంటున్నారు..

 

ఇదిలా ఉంటే నాగార్జున ప్రస్తుతం 'వైల్డ్ డాగ్' అనే పోలీస్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఎసిపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. నాగార్జున వరసగా ఇలా యాక్షన్ ప్రధానమైన సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆశ్చర్యకరమే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS