ప‌ర్‌ఫెక్ట్ టైమింగ్‌: సుకుమార్‌పై మ‌హేష్ పంచ్‌

By iQlikMovies - May 02, 2019 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

''ఓ హీరో కోసం ద‌ర్శ‌కుడు రెండేళ్లు ఎదురుచూడ‌డం చాలా క‌ష్టం. ఈరోజుల్లో రెండు నెల‌లు కూడా ఓపిక ఉండ‌డం లేదు. మ‌రో హీరోని వెదుక్కుంటున్నారు'' ఇదీ 'మ‌హ‌ర్షి' ప్రీ రిలీజ్ వేడుక‌లో మ‌హేష్ బాబు చేసిన కామెంట్‌. ఇది వ‌ర‌కైతే ఈ కామెంట్‌కి పెద్ద‌గా ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ కామెంటే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. దానికి కార‌ణం సుకుమార్ అని వేరే చెప్పాలా? మ‌హ‌ర్షి త‌ర‌వాత మ‌హేష్ సుకుమార్‌తో ఓ సినిమా చేయాల్సింది.

 

సుకుమార్ క‌థ కూడా సిద్దం చేసేసుకున్నాడు. కానీ ప‌ట్టాలెక్క‌డం కాస్త ఆల‌స్యం అయ్యింది. దాంతో సుకుమార్ మ‌హేష్‌ని వ‌దిలేసి  అల్లు అర్జున్ ప‌క్క‌న చేరాడు. మ‌హేష్ చేసిన కామెంట్‌కి లింకు అక్క‌డ ఉంద‌న్న‌మాట‌. ఈ కామెంట్ సుకుమార్ ని ఉద్దేశించి చేసిన‌దే అని వేరే చెప్పాలా? సుకుమార్‌ మ‌హేష్ ని వ‌దిలేసి వ‌చ్చేశాక‌ మ‌హేష్ పాజిటీవ్‌గా స్పందిస్తూ ఓ ట్వీట్ చేశాడు. అనుకోని కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా ఆగిపోయింద‌ని, త్వ‌ర‌లో త‌ప్ప‌కుండా క‌ల‌సి ప‌నిచేస్తామ‌ని పాజిటీవ్‌గా మాట్లాడాడు.

 

అయితే ఇప్పుడు ఈ మాట‌ల‌తో సుకుమార్ ఎపిసోడ్‌ని మ‌హేష్ లైట్‌గా తీసుకోలేద‌ని, మ‌న‌సులో పెట్టుకునే ఇలా మాట్లాడాడ‌ని అర్థ‌మైపోతోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే మ‌హేష్ ద‌ర్శ‌కుల గురించీ సినిమాల గురించీ ప్ర‌స్తావిస్తూ సుకుమార్‌నీ, 'నేనొక్క‌డినే' సినిమానీ మ‌ర్చిపోయాడు. ఇదంతా రివైంజ్‌లో భాగ‌మే అన్న‌ది మ‌హేష్ అభిమానుల మాట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS