ఒమన్‌లో సూపర్‌స్టార్ మహేష్‌బాబు కుటుంబంతో హాలీడే వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. అందులో భాగంగా, మహేష్‌బాబు పారా గ్లైడింగ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మహేష్ సతీమణి, హీరోయిన్ అయిన నమ్రతా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మహేష్ ఫ్యాన్స్ ఈ ఫోటోలను చూసి దిల్ ఖుషీ అవుతున్నారు.
సూపర్‌స్టార్ కదా. కెరీర్‌లో చాలా బిజీగా ఉంటాడు. అయినా కానీ సినిమాల నుండి ఏ చిన్న విరామం దొరికినా, మహేష్‌బాబు తన టైంని ఫ్యామిలీ కోసం కేటాయిస్తూ ఉంటాడు. ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుండడం మహేష్‌బాబుకి అలవాటే. మహేష్ మాత్రమే కాదు, చరణ్, ఎన్టీఆర్, నాని.. ఇలా తదితర ఈ తరం హీరోలు కూడా ఇంతే. ఇదివరకటి రోజుల్లో హీరోలకు సినిమానే ప్రపంచం, సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా, ఫ్యామిలీకి టైం కేటాయించే అవకాశాలుండేవి కాదు.
కానీ ఈ తరం హీరోలు అలా కాదు. సినిమాల నుండి చిన్న గ్యాప్ దొరికినా చాలు, సినిమా లైఫ్‌ని పక్కన పెట్టి, ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. విదేశాలకు చెక్కేస్తున్నారు. అక్కడ ఫ్యామిలీతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. రీ ఫ్రెష్ అవుతున్నారు. మళ్లీ సినిమాల్లో ఫ్రెష్‌గా జాయిన్ అయిపోతున్నారు. అలా అని సినిమాల పట్ల కమిట్‌మెంట్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ విరామం, మరింత యాక్టివ్‌గా, ఉల్లాసంగా ఉంచేందుకు సహకరిస్తోంది.
అలా ఇటు సినిమాలకీ, అటు ఫ్యామిలీకి ఈక్వెల్‌గా ఇంపార్టెన్స్ ఇస్తూ, రెట్టించిన ఉత్సాహంతో ప్రేక్షకుల్నీ, అభిమానుల్ని ఎంటర్‌టైన్ చేయగలుగుతున్నారు నేటి తరం హీరోలు. మరో విషయం ఏంటంటే ఈ వెకేషన్స్ ద్వారా సోషల్ మీడియాలో తమ తమ అభిమాన నటీనటుల పర్సనల్ లైఫ్ గురించి కూడా తెలుసుకొనే అకాశం అభిమానులకు కలుగుతుంది.