మ‌హేష్ ఫ్యాన్స్‌కి కెలికేసిన త‌మ‌న్‌

By Gowthami - January 20, 2020 - 10:30 AM IST

మరిన్ని వార్తలు

ఈ సంక్రాంతికి విడుద‌లైన స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పుర‌ములో సినిమాల మ‌ధ్య పోటీ భీక‌రంగా న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. మేమే ఈ సంక్రాంతి విజేత అని ఒక‌రు, అస‌లు సిస‌లైన సంక్రాంతి విన్న‌ర్ మేమే అంటూ ఇంకొక‌రు పోస్ట‌ర్ల మీద పోస్ట‌ర్లు వేసుకుంటున్నారు. గ్రాసులు, షేర్లూ, నాన్ బాహుబ‌లి రికార్డులూ అంటూ అంకెల గార‌డీ చూపిస్తున్నారు. ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమిత‌మైన ఈ పోటీ.. ఇప్పుడు మాట‌ల్లోకి వ‌చ్చేసింది. అల వైకుంఠ‌పుర‌ములో థ్యాంక్స్ మీట్ ఆదివారం రాత్రి విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా త‌మ‌న్ చేసిన కామెంట్ల‌పై మ‌హేష్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

 

నిజ‌మైన మాట‌లే మాట్లాడ‌మంది.. నిజ‌మైన‌ క‌ల‌క్ష‌న్లే చెప్ప‌మంది... ఈరోజు చెప్పాం.. గెలిచాం... కొట్టాం ఈరోజు.. అంటూ - ప‌రోక్షంగా స‌రిలేరు నీకెవ్వ‌రు పై కౌంట‌ర్ వేశాడు. మావి నిజ‌మైన క‌ల‌క్ష‌న్లు అంటే అర్థం ఏమిటి? మీవి కావ‌నే క‌దా? ఈ కామెంట్ల‌కు మ‌హేష్ ఫ్యాన్స్ హ‌ర్ట‌య్యారు. త‌మ‌న్‌ని ఓ రేంజులో ఆడుకోవ‌డం మొద‌లెట్టారు. అస‌లు రికార్డుల గొడ‌వ నీకెందుకు? అంటూ ఫైర్ అవుతున్నారు. సంక్రాంతి సీజ‌న్‌, ఆ హ‌డావుడి ముగుస్తున్న స‌మ‌యంలో ఇలాంటి కామెంట్లు చేయ‌డం అంత మంచిది కాదు. ఇది ప‌రిశ్ర‌మ‌లోని ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణానికి తూట్లు పొడుస్తుంది. ఈ విష‌యం త‌మ‌న్ గ్ర‌హించ‌క‌పోవ‌డం విచార‌క‌రం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS