అంతలా భయపెట్టొద్దు 'మహర్షీ'.!

మరిన్ని వార్తలు

మే 9న 'మహర్షి' ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే గట్టిగా నెల రోజులు మాత్రమే టైం మిగిలి ఉంది. ఈ పాటికి సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేయాలి. కానీ ఇంకా చిత్రీకరణ పెండింగ్‌లో ఉంది. కొన్ని సీన్స్‌తో పాటు, రెండు పాటలు కూడా బ్యాలెన్స్‌ ఉండిపోయాయి. ఈ నెల రోజుల్లో ఈ మొత్తం చిత్రీకరణ జరపడమంటే కత్తి మీద సామే. ఇప్పటికే డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి రాత్రీ పగలు అనే తేడా లేకుండా కష్టపడుతున్నారు. 

 

కానీ పెండింగ్‌ వర్క్‌ ఎందుకు ఆలస్యమవుతుందో అనే విషయమై పక్కా క్లారిటీ లేదు. ఈ క్రమంలో పలు గాసిప్స్‌ వినిపిస్తూన్నాయి. మరోసారి 'మహర్షి' వాయిదా పడనుందంటున్నారు. కాదు కాదు పెండింగ్‌ షూటింగ్‌ పక్కన పెట్టేసి సినిమా విడుదల చేద్దామనుకుంటున్నారట. ఇప్పటికే క్రియేటివిటీ పేరు చెప్పి సినిమాని తెగ కెలికేశారనే ప్రచారం జరుగుతోంది. పెద్ద సినిమాల విషయంలో ఇలాంటి గాసిప్స్‌ సహజమే. కానీ 'మహర్షి' సినిమాకి మరీ గాసిప్స్‌ ఎక్కువైపోయాయి. 

 

అయితే ఏది ఏమైనా రిలీజ్‌కి అనుకున్న టైంని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్‌ చేయకూడదనే గట్టి పట్టు మీదుంది చిత్ర యూనిట్‌. ఈ మధ్య విడుదల చేసిన పోస్టర్స్‌తో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేశాయి. ఈ తరుణంలో సినిమా మరోసారి పోస్ట్‌పోన్‌ అయ్యిందంటే, ఫ్యాన్స్‌లో మళ్లీ నిరాశ మొదులవుతుంది. ఏమో సర్క్యులేట్‌ అవుతున్న గాసిప్స్‌ మహేష్‌ ఫ్యాన్స్‌ని అంతకంతకూ భయపెట్టేస్తున్నాయి. ఈ భయం పోవాలంటే అనుకున్న టైంకి 'మహర్షి' ఖచ్చితంగా విడుదల కావాల్సి ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS