త్రివిక్రమ్ అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఎంతో ఇష్టం. ఎందుకంటే... మహేష్ బాబు కెరీర్‌లో మర్చిపోలేని సినిమాల్ని అతడు, ఖలేజా రూపంలో ఇచ్చాడు త్రివిక్రమ్. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో.. హ్యాట్రిక్ సినిమా రాబోతోంది. ఆ సినిమా అప్ డేట్స్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్‌పుట్టిన రోజు ఈనెల 9న జరిగింది. ఆ రోజున ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ వస్తుందని ఆశ పడ్డారు. కనీసం టైటిల్ అయినా చెబుతారని ఎదురు చూశారు. షూటింగ్ డిటైల్స్ వస్తాయని అనుకొన్నారు. కానీ.. ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా నిరాశ పరిచారు.
ఆగస్టు 9నే.. మహేష్ సినిమా మొదలవుతుందని మొదట్నుంచీ ప్రచారం జరుగుతోంది. అయితే నిర్మాతల సమ్మెవల్ల షూటింగ్ ప్రారంభం కాలేదు. ఈనెల 16న మరో ముహూర్తం ఉంది. అప్పుడూ మొదలయ్యే ఛాన్స్ లేదని సమాచారం. ఈ నెలాఖరుకి గానీ సినిమా స్టార్ట్ అవ్వదని తెలుస్తోంది. అలాంటప్పుడు కనీసం టైటిల్ అయినా చెబితే బాగుండేదని ఫ్యాన్స్ ఫీలింగ్. ఈ సినిమా గురించి ఇప్పటికే కొన్ని టైటిల్స్ బయట ప్రచారంలో ఉన్నాయి. అయితే దర్శక నిర్మాతల నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. మహేష్ పుట్టినరోజు కంటే మంచి ముహూర్తం ఏముంటుంది? అప్పుడు కూడా దర్శక నిర్మాతలు మౌనంగా ఉండడం ఫ్యాన్స్ కి నచ్చడం లేదు.