సరిగ్గా ఆరేళ్ళ క్రితం (2012) దూకుడు చిత్రంలో మహేష్ బాబు పాడిన గురువారం మార్చ్ 1 సాయంత్రం 5.40 పాటలోని సాహిత్యం తగ్గట్టుగా మార్చ్ 1న గురువారం వచ్చింది.
మళ్ళీ ఆరేళ్ళ తరువాత ఈరోజు అనగా మార్చ్ 1న గురువారం వచ్చింది. మరి ఈరోజు 5.40కి మీకు తొలిసారిగా ఎవరినైనా అమ్మాయిని చూస్తారా? అలా చూసిన అమ్మాయి మీ గుండె జల్లుమనేలా ఉంటుందా? మరి ఇలాంటి వాటికి సమాధానం ఈరోజు సాయంత్రం 5.40 తరువాత ఈ ఆర్టికల్ కింద కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి.
ఇక మహేష్ బాబు, సమంతా కలిసి నటించిన దూకుడు చిత్రంలో వచ్చిన ఈ పాటని తమన్ సంగీతం సమకూర్చగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. ఇక ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
కాకతాళీయంగా ఇలా జరుగుతుంటుంది. మరి మీరు కూడా ఈరోజు మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.