బాహుబలి రెండు పార్ట్శ్ తో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు సంపాదించుకున్న ప్రభాస్ కి సంజు చిత్రం రూపంలో ఒక షాక్ తగిలింది. అయితే ఆ షాక్ అనేది వ్యక్తిగతంగా కాదు ఆయన నటించిన బాహుబలి చిత్రానికి సంబంధించినది..
ఆ వివరాల్లోకి వెళితే, ప్రభాస్ నటించిన బాహుబలి 2 చిత్రం హిందీలో డబ్బింగ్ చేయబడింది. ఆ చిత్రం హిందీ వెర్షన్ ఒక్కరోజు వసూళ్ళు రూ 46.50 కోట్లు రావడంతో హిందీ సినిమాలని సైతం వెనక్కి నెట్టేసి ఒక్కరోజు కలెక్షన్స్ పరంగా ఒక పెద్ద రికార్డునే సృష్టించింది. దీనితో డబ్బింగ్ చిత్రంగా విడుదలైనప్పటికి కూడా బాహుబలి 2, అక్కడి హిందీ సినిమాలు అందుకోలేని స్థాయిలో నిలిచింది.
ఇక తాజాగా ఈ మార్కుని సంజు చిత్రం దాటడంతో బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డు ఇప్పుడు సంజు పేరిట మారిపోయింది. సంజు చిత్రానికి మూడవ రోజున రూ 46.71 కోట్లు వచ్చాయి, ఇది బాహుబలి 2 రికార్డుని అదిగమించేలా చేసింది.
మొత్తానికి సంజు చిత్రం బాహుబలి 2కి బాలీవుడ్ లో చెక్ పెట్టగలిగింది.