మహేష్ స్పైడర్ చిత్రం ముగించకుండానే తన తరువాతి చిత్రం మొదలుపెట్టేయనున్నాడు.
వివరాల్లోకి వెళితే, మహేష్-కొరటాల శివ కాంబినేషన్ లో రాబోయే చిత్రం రేపటినుండి మొదలుకానుంది. అయితే ఈ మొదటి షెడ్యూల్ లో మహేష్ పాల్గొనటం లేదు. రెండవ షెడ్యూల్ నుండి మహేష్ పాల్గొంటాడు అని తెలుస్తుంది.
ప్రస్తుతానికి శరత్ కుమార్ పైన కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. ‘భరత్ అను నేను’ షూటింగ్ ని ఈ ఏడాది చివరికల్లా పూర్తిచేసి 2018 సంక్రాంతికి రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.
సో గుడ్ లక్ టు మహేష్-కొరటాల.