మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా హైద్రాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాకి 'జాలరి' అనే టైటిల్ ఇంతవరకూ ప్రచారం జరిగింది. కానీ తాజాగా 'ఉప్పెన' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. కథకు తగ్గట్లు 'ఉప్పెన' అయితేనే బావుంటుందని ఈ టైటిల్‌ని ఫిక్స్ చేశారట.
మొత్తానికి 'ఉప్పెన' అనే టైటిల్ అనౌన్స్ చేశాక, సినిమాపై ఇంతవరకూ ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. పల్లెటూరి వాతావరణంలో నేచురాలిటీకి దగ్గరగా సినిమాని తెరకెక్కించనున్నారట. సినిమాలో హీరో జాలరి పాత్రలో కనిపించనున్నాడన్న సంగతి ఫస్ట్‌లుక్‌తో అర్ధమైంది. మత్య్సకారుల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందట. పక్కా పల్లెటూరి కుర్రోడిలా ప్రామిసింగ్ లుక్‌లో కనిపించనున్నాడు వైష్ణవ్‌తేజ్.
తొలి సినిమాకే వైష్ణవ్‌కి నటుడిగా సత్తా ఏంటో చాటి చెప్పే సినిమా అవుతుందని అంతా అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట. హీరోయిన్ విషయమై పలువురు కొత్త భామల పేర్లు పరిశీలిస్తున్నారు. త్వరలోనే కన్‌ఫామ్ చేయనున్నారు.