సూపర్ స్టార్ మహేష్ బాబు తన కొత్త సినిమాలో ఇంతకుముందు ఎప్పుడు చూడని కొత్త కోణంలో కనిపిస్తాడని తెలుస్తుంది. దీనంతటికి కారణం డైరెక్టర్ మురుగదాస్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
దాదాపుగా షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సమయంలో చిత్ర యూనిట్ టీజర్ రిలీజ్ చేయాలనే యోచనలో ఉందట! ఈ టీజర్ ౩౦ సెకెన్ల పాటు ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే, ఈ టీజర్ ని లండన్లోని ప్రముఖ స్టూడియోలో ఎడిట్ చేయనున్నారట.
దీనికి కారణం టీజర్ తోనే సినిమా కాన్సెప్ట్ చెప్పే ఆలోచనలో డైరెక్టర్ ఉన్నాడని, దీనితో ఈ టీజర్ ని జాగ్రతగా ఎడిట్ చేయడానికి అలాగే “సీజీ” ఎఫెక్ట్స్ కోసం కూడా అంత దూరం వెళ్తున్నారు అని తెలుస్తుంది.
చూద్దాం.. మరి ఆ టీజర్ ఏ స్థాయిలో ఉండబోతుందో!