సూపర్‌స్టార్‌ స్పెషల్‌ ట్రీట్‌ అదిరింది గురూ!

By iQlikMovies - August 09, 2019 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా, ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరూ..' చిత్రం నుండి అదిరిపోయే ఫస్ట్‌లుక్‌ టీజర్‌ రిలీజ్‌ చేసి సూపర్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. మహేష్‌ పాత్రను పరిచయం చేస్తూ వదిలిన ఈ ఫస్ట్‌లుక్‌ టీజర్‌లో మహేష్‌ ఆర్మీ ఆఫీసర్‌గా టెంట్‌ నుండి బయటికి నడిచొస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం నింపుతోంది. ఎక్స్‌పెక్ట్‌ చేసిన దానికన్నా ఎక్కువే సర్‌ప్రైజ్‌ చేశాడు మహేస్‌ ఈ టీజర్‌తో. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. లేటెస్ట్‌ టీజర్‌లో 'సరిలేరు నీకెవ్వరూ..' అనే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ స్పెషల్‌ కిక్‌ ఇస్తోంది.

 

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయనున్నారు. సీనియర్‌ నటి విజయశాంతి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. నటుడు బండ్ల గణేష్‌ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌. జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేష్‌బాబు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముద్దుగుమ్మ రష్మికా మందన్నా, మహేష్‌కి జోడీగా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS