పెళ్లా.? నాకా.? అని షాకిచ్చిన 'ఛార్మి'ంగ్‌ బ్యూటీ.!

మరిన్ని వార్తలు

'పెళ్లా.. నాకా.? నేనింకా స్వీట్‌ సిక్స్‌టీనే.. అనే డైలాగ్‌ ఎప్పుడో ఎక్కడో విన్నట్లుంది. అయితే ఆ డైలాగ్‌ పక్కన పెట్టేయండి ఏదో జస్ట్‌ ఫర్‌ ఫన్‌ అంతే. అసలు వివరాల్లోకి వెళితే, ఛార్మింగ్‌ గాళ్‌ ఛార్మి పెళ్లి విషయంలో ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. తనకి పెళ్లిపై అస్సలు ఆశక్తి లేదట.

 

ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో, భవిష్యత్తులో అసలు పెళ్లి చేసుకుంటుందో లేదో కూడా సస్పెన్సేనట.. చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చేసిన ఛార్మి, గ్లామర్‌ డాళ్‌గా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. 'జ్యోతిలక్ష్మి' చిత్రం తర్వాత ఇక నటనకు దూరమైంది. దర్శకుడు పూరీ జగన్నాధ్‌తో కలిసి పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌లో నిర్మాణ బాధ్యతలు చూసుకుంటోంది. అయితే అప్పుడప్పుడూ ఛార్మి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే హాట్‌ పిక్స్‌ చూసి, నెటిజన్లు మళ్లీ ఛార్మి ఎప్పుడు తెరపై కనిపిస్తుంది.? అంటూ ప్రశ్నలు సంధిస్తుంటారు. కానీ అప్పుడెప్పుడూ ఛార్మి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. కానీ తాజాగా ఈ ప్రశ్నకు కూడా ఛార్మి నుండి క్లారిటీగా సమాధానం దొరికింది. గత 15 ఏళ్లుగా హీరోయిన్‌గా నటించి, నటనపై బోర్‌ కొట్టేసిందట. బహుశా ఇకపై నటించే అవకాశం లేదని ఛార్మి చెప్పేసింది. అంటే ఛార్మి గ్లామర్‌ తెర వెనుకకే పరిమితమైపోవాల్సిందేనన్న మాట. రేపో మాపో ఇంకెప్పటికో ఛార్మి స్క్రీన్‌పై కనిపిస్తుందని ఆశించే ఛార్మి ఫ్యాన్స్‌కిది బాధాకరమైన విషయమే.

 

ప్రస్తుతం ఛార్మి నిర్మాణంలో 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అన్నట్లు ఈ రోజు అందాల ఛార్మి పుట్టినరోజు. నటించకపోయినా, నిర్మాతగా సక్సెస్‌ అవ్వాలని ఆశిస్తూ, ఛార్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేద్దామా. హ్యాపీ బర్త్‌డే టు ఛార్మి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS