ఎప్పటి నుండో అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న 'స్పైడర్' ఆడియో సింగిల్ రానే వచ్చింది. సింప్లీ సూపర్బ్ అనేలా ఉంది ఆ ఆడియో సింగిల్. అద్భుతమైన మ్యూజిక్, విజువల్స్ చాలా బాగున్నాయి. హారిస్ జైరాజ్ మ్యూజిక్ చెవులకు ఎంత వినపొంపుగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇకపోతే ఆడియో సింగిల్‌లో కొన్ని మేకింగ్ షాట్స్ చూపించారు. అందులో మహేష్ సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. హ్యాండ్‌సమ్‌లో మహేష్‌ని మించిన వారు లేరు టాలీవుడ్ హీరోల్లో. అయితే ఈ సినిమాలో మహేష్ ఇంతకు ముందెన్నడూ కనిపించనంత స్టైలిష్‌గా ఉన్నాడు. అభిమానులు తమ అభిమాన హీరోని అలా చూసి, ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై పోతున్నారు. ఇక అమ్మాయిల సంగతి చెప్పనే అక్కర్లేదు. మహేష్ ఆ పేరులోనే ఏవో వైబ్రేషన్స్ ఉంటాయి అసలే అమ్మాయిలకి. ఆడియో సింగిలే ఇంత కిక్కిస్తుంటే, ఇక మహేష్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ రాబోతోంది. ఆ టీజర్‌ని ఇంకెంతలా కట్ చేసి ఉంటాడో డైరెక్టర్ మురుగదాస్. మురుగదాస్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదో బైలింగ్వల్ మూవీ. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రత్యేకించి చెప్పుకోదగ్గది విలన్ క్యారెక్టర్ గురించి. విలన్‌గా ఎస్.జె.సూర్య నటించాడు. డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన ఎస్.జె.సూర్య క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశారట. స్కై కాప్‌గా నటిస్తున్నాడు మహేష్ 'స్పైడర్'లో. సినిమా దసరాకి విడుదల కానుంది.