మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తోన్న 'స్పైడర్' టీజర్ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌తో మహేష్ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తున్నాడు. ఇక టీజర్ వచ్చిందంటే ఆ అంచనాలు ఇంకే రేంజ్‌లో ఉంటాయో. అసలే ఇప్పుడొస్తున్న టీజర్స్‌కి ఆడియన్స్ డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం వచ్చిన టీజర్స్ లో 'లై', 'జై లవ కుశ' తదితర టీజర్స్ విపరీతంగా రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అలాగే వాటన్నింటినీ మించి ఈ టీజర్ ఉండబోతోందట. అసలే అక్కడ ఉన్నది మురుగదాస్. మురగదాస్ అంటేనే క్రియేటివిటీకి పెట్టింది పేరు. మరి ఆయన డైరెక్షన్‌లో వస్తోన్న 'స్పైడర్' టీజర్ ఇంకెన్ని సంచనలనాలకు వేదికవుతుందో చూడాలిక. ఇప్పటి వరకూ ఈ సినిమాకి సంబంధించి విడుదలైన గ్లింప్స్ సంచలనాలు సృష్టిస్తోంది. ఆడియో సింగిల్ అదరగొట్టేస్తోంది. ఇక రేపు ఉదయం 9గంటలకు టీజర్ రానుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. తెలుగు, తమిళ భాషల్లో ఒకే సారి రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాతోనే మహేష్ తమిళ ఎంట్రీ షురూ అవుతోంది. తమిళ డైరెక్టర్ కమ్ హీరో ఎస్.జె.సూర్య ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరో తమిళ యంగ్ హీరో భరత్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. స్కై కాప్‌గా మహేష్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోంది ఈ సినిమాలో.