మురుగదాస్ సినిమాల్ని తక్కువగా అంచనా వేయడానికి లేదు. స్క్రీన్‌పై ఏదో మాయా జాలం చేసేస్తూ ఉంటాడు. అలాగే సమాజానికి దగ్గరగా ఉంటాయి ఆయన సినిమాలు. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'స్పైడర్'. మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతోందీ చిత్రం. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న ఈ సినిమా టీజర్ రానే వచ్చింది. టీజర్‌లో 'పెరుగుతున్న జనాభాని కంట్రోల్ చేసేందుకు గవర్నమెంట్, భూకంపం, సునామీలా నేనూ ఒక భాగమే' అని ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న ఎస్.జె.సూర్య చెబుతున్న డైలాగ్ మెయిన్ అట్రాక్షన్ అయ్యింది. అలాగే 'భయపెట్టడం మాకూ తెలుసు' అని సూపర్ స్టార్ చెప్పే డైలాగ్ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది. ఈ టీజర్‌ని యూ ట్యూబ్‌లో పోస్ట్ చేసిన గంటలోనే వ్యూస్ వరద స్టార్ట్ అయ్యింది. విజయ దశమి సందర్భంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగుతో పాటు, తమిళంలోనూ ఈ సినిమా విడుదల కానుంది. అందుకు తగ్గట్లుగానే తెలుగు, తమిళ నేటివిటీలకు సరిపడేలా టీజర్‌ని కట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్‌బాబు ఈ సినిమాలో 'స్కై కాప్'గా నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రమిది. ఎన్. వి. ప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ రోజు మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు 'స్పైడర్' టీజర్‌ని బహుమతిగా అందించారు మహేష్.