నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'లై'. ఇట్స్ నాట్ ఎ లై ఈ సినిమాతో నితిన్ కొల్లగొట్టేస్తాడంటున్నారు. నితిన్‌కి పవన్ కళ్యాణ్ సపోర్టు బాగా ఉంది. అలాగే పవన్ అభిమానుల సపోర్ట్ కూడా ఫుల్‌గా ఉంది. దాంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు న్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. డిఫరెంట్ యాక్షన్ డ్రామా ఇది. సాఫ్ట్ క్యారెక్టర్స్‌లో కనిపించిన నితిన్ ఈ సినిమాలో డిఫరెంట్ మాస్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు. ఏ పనీ లేకుండా ఆవారాగా తిరిగే కుర్రాడు. పేరు సత్యం కానీ అబద్ధం తప్ప అస్సలు నిజం చెప్పని కుర్రాడు హీరో. అలాంటి అబద్ధం చుట్టూ సాగే కథని డైరెక్టర్ ఎంత తెలివిగా తెరకెక్కించాడనేది చూడాలంటే మరి కొద్ది రోజులు మాత్రమే ఆగాలి. ఆగష్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సీనియర్ నటుడు అర్జున్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. గతంలో నితిన్ - అర్జున్ కాంబినేషన్‌లో 'శ్రీ ఆంజనేయం' సినిమా వచ్చింది. అందులో అమాయకుడైన హీరోకి అండగా నిలబడే ఆంజనేయస్వామి పాత్రలో కనిపించాడు అర్జున్. కానీ ఈ సినిమాలో ఈ ఇద్దరూ ప్రత్యర్ధులుగా నటిస్తున్నారు. ఇద్దరి పాత్రలూ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. టీజర్‌తోనే సగం మార్కులు కొట్టేశాడు నితిన్. మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. డిఫరెంట్ మాస్ గెటప్స్‌తో ఇటు మాస్ ఆడియన్స్‌నీ, అటు క్లాస్ ఆడియన్స్‌నీ ఎట్రాక్ట్ చేస్తున్నాడు నితిన్.