అందుకే మ‌హేష్ సినిమా ఆగిపోయింద‌ట‌

మరిన్ని వార్తలు

మ‌హ‌ర్షి త‌ర‌వాత‌.. సుకుమార్‌తో మ‌హేష్ బాబు ఓ సినిమా చేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. సుకుమార్ కూడా మ‌హేష్‌ని క‌లిసి కొన్ని క‌థ‌లు చెప్ప‌డం, మ‌హేష్ మార్పులు సూచించ‌డం తెలిసిన విష‌యాలే. మ‌ధ్య‌లో అనిల్ రావిపూడి కూడా వ‌చ్చాడు. అనిల్ రావిపూడి క‌థ మ‌హేష్‌కి న‌చ్చ‌డంతో ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంద‌న్న వార్త‌లొచ్చాయి. అయితే గ‌త రెండు రోజులుగా మ‌హేష్- సుకుమార్ కాంబినేష‌న్‌లో సినిమాపై మ‌ళ్లీ వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. 

 

సుకుమార్ చెప్పిన క‌థ కూడా మ‌హేష్‌కి న‌చ్చేసింద‌ని, ఇప్పుడు రెండు సినిమాల్నీ ఒకేసారి మొద‌లెట్టేస్తార‌ని మ‌హేష్ డ‌బుల్ బొనాంజా కొట్టేసిన‌ట్టే అని అనుకున్నారు. అయితే... అనూహ్యంగా సుకుమార్ - బ‌న్నీ సినిమా ఓకే అయిపోయింది. మ‌హేష్ సినిమాని ప‌క్క‌న పెట్టి బ‌న్నీకి క‌మిట్ అయిపోయాడు సుకుమార్‌. ఇప్పుడు సుకుమార్ - మ‌హేష్ సినిమా లేన‌ట్టే. దానికి గ‌ల కార‌ణాన్ని కూడా మ‌హేష్ బ‌య‌ట‌పెట్టాడు. 

 

కేవ‌లం క్రియేటీవ్ డిఫ‌రెన్సెన్ వ‌ల్ల‌నే ఈ సినిమా ఆగిపోయింద‌ని, భవిష్య‌త్తులో త‌ప్ప‌కుండా సుకుమార్‌తో పని చేస్తాన‌ని, త‌ను తీయ‌బోయే సినిమా బాగా ఆడాల‌ని ఆల్ ది బెస్ట్ చెప్పాడు మ‌హేష్‌. అంతేకాదు... సుకుమార్‌తో తీసిన `వ‌న్` త‌న కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా మిగిలిపోతుంద‌ని గుర్తు చేసుకున్నాడు. సో... వీరిద్ద‌రి సినిమా ఇప్పుడు లేక‌పోయినా.. భ‌విష్య‌త్తులో మాత్రం త‌ప్ప‌కుండా ఉంటుందన్న‌మాట‌. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS