నగ్మా ఎందుకు పెళ్లి చేసుకోలేదో క్లారిటీ ఇచ్చేసింది..!

మరిన్ని వార్తలు

సీనియర్‌ నటి నగ్మా పలువురు సీనియర్‌ హీరోల సరసన గ్లామర్‌ తారగా వెలుగొందింది. తర్వాత కొంచెం గ్యాప్‌ తీసుకుని 'అల్లరి రాముడు' సినిమాలో యంగ్‌ హీరో ఎన్టీఆర్‌కి అత్తగా నటించింది. ఇక తర్వాత రాజకీయాలతో బిజీగా ఉంటూ సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టిన నగ్మా ఇంపార్టెంట్‌ రోల్స్‌ వస్తే నటించేందుకు సిద్ధంగా ఉంది. ఇకపోతే హీరోయిన్‌గా కెరీర్‌లో ఎంతో సక్సెస్‌ అందుకుని, రాజకీయాల్లోనూ సత్తా చాటుతున్న నగ్మా ఇంతవరకూ పెళ్లి చేసుకోలేదు. 

 

పలువురు నటులతో లివింగ్‌ రిలేషన్‌షిప్స్‌ ఉన్నట్లు నగ్మాపై రూమర్స్‌ ఉన్నాయి. అయితే వాటిపై నగ్మా ఎప్పుడూ స్పందించలేదు. కానీ మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీతో నగ్మా అప్పట్లో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించారనే రూమర్‌ కూడా ఉంది. అయితే అది నిజమేననీ, తమ రిలేషన్‌షిప్‌ కారణంగా గంగూలీ కెరీర్‌ నాశనమవుతుందని భావించి ఆ రిలేషన్‌షిప్‌కి తానే బ్రేకప్‌ చెప్పేశాననీ నగ్మా తాజాగా అప్పటి విషయాలు గుర్తు చేసుకుంది. 

 

కానీ ఇప్పుడు టైం కలిసొస్తే, ఖచ్చితంగా మరో మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుంటాననీ చెప్పింది నగ్మా. ఇదిలా ఉంటే త్వరలోనే ఓ థ్రిల్లర్‌ మూవీతో నగ్మా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ మూవీలో నగ్మా నటిస్తోందంటూ ఈ మధ్య గాసిప్స్‌ వినిపించాయి. కానీ ఈ గాసిప్‌లో నిజం లేదనీ, ఈ ప్రాజెక్ట్‌ విషయమై తననింతవరకూ ఎవరూ కాంటాక్ట్‌ చేయలేదనీ, నగ్మా క్లారిటీ ఇచ్చారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS