'హైబ్రీడ్ పిల్ల'.. భానుమతి.. ఒక్కటే పీస్.. అనే డైలాగులతో తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయిపల్లవి. తొలి సినిమా 'ఫిదా' శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్లో దిల్‌రాజు రూపొందించిన సంగతి తెలిసిందే. తర్వాతి సినిమా 'ఎంసీఏ' కూడా దిల్‌రాజు బ్యానర్లోనే రూపొందింది. ఇక తాజాగా దిల్‌రాజు సాయిపల్లవికి మరో ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో దిల్‌రాజు బ్యానర్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకుడు.
ఈ సినిమాలో హీరోయిన్గా సాయిపల్లవిని ఎంచుకునే యోచనలో దిల్ రాజు అండ్ టీమ్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారమ్. ఆచితూచి సినిమాలు చేసే సాయిపల్లవికిది బంపర్ ఛాన్సే అని చెప్పాలి. మామూలుగా అయితే కథలో విషయం ఉండి, తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే సాయిపల్లవి ఆ సినిమాకి సైన్ చేస్తుంది. అయితే అక్కడున్నది దిల్ రాజు. తనను తెలుగు తెరకు పరిచయం చేసిన రాజుగారు అడిగితే సాయిపల్లవి కాదనే అవకాశం లేదు.
ఇదిలా ఉంటే, ఈ సినిమాలో ఇంకో హీరోయిన్‌కీ చోటుందట. సాయిపల్లవి గ్లామర్‌కి దూరం కాబట్టి, పర్ఫామెన్స్ రోల్లో సాయిపల్లవిని ఉంచి, గ్లామర్ కోసం ఇంకో భామను పరిశీలిస్తున్నారనీ తెలుస్తోంది. చూడాలి మరి నిజంగానే సాయిపల్లవి లిస్టులో ఈ ప్రాజెక్ట్ జాయిన్ అయ్యిందా.? తెలియాలంటే ఇంకాస్త టైం వెయిట్ చేయాల్సిందే. ఇటీవల సాయి పల్లవి 'పడి పడి లేచె మనసు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.