అప్పుడు పవన్.. ఇప్పుడు మహేశ్

మరిన్ని వార్తలు

పవన్ కళ్యాణ్ అంటే యంగ్ హీరో నితిన్ కి ఎంత ఇష్టమో  ప్రత్యేకంగా చెప్పకర్లేదు. పవన్ కూడా నితిన్ అంటే కూడా అంతే ఇష్టంగా వ్యవహరిస్తాడు.

ఇక తన సినిమా ఈవెంట్స్ కి కూడా పవన్ కళ్యాణ్ రావడం ఒక ఆనవాయితీగా మారింది. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ ని బ్రేక్ చేస్తూ సూపర్ స్టార్ మహేష్ రానున్నాడట! తెలియవస్తున్న వివరాల ప్రకారం, నితిన్ నటించిన ‘లై’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా సూపర్ స్టార్ మహేష్ హాజరుకానున్నాడట.

లై చిత్ర నిర్మాతలైన 14 రీల్స్ వారికి మహేష్ కి ఉన్న సాన్నిహిత్యం వల్లనే ఈ ఈవెంట్ కి సూపర్ స్టార్ రాబోతున్నాడు అని సమాచారం. ఇంతకుముందు నాని నటించిన క్రిష్ణగాడి వీర ప్రేమ గాద చిత్ర ఆడియో విడుదల కార్యక్రమానికి కూడా విచ్చేశాడు.

మొత్తానికి ఈ సారి పవన్ ప్లేస్ లో మహేష్ రానున్నాడట.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS