'బిగ్‌' కెప్టెన్‌: కెప్టెన్సీ దక్కించుకున్న మహేష్‌ విట్టా!

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌లో కెప్టెన్‌ అవ్వాలనేది ఇంటి సభ్యులందరికీ ఓ కోరికగా ఉంటుంది. బాబా భాస్కర్‌ తనకు దక్కిన కెప్టెన్సీని క్యాజువల్‌గా తీసుకుని కామెడీ చేశారేమో కానీ, వితిక, మహేష్‌ లాంటి వాళ్లు ఆ పదవిని సద్వినియోగం చేసుకోవాలని భావించి ఒక్కసారైనా ఆ ఛాన్స్‌ దక్కించుకోవాలని ఆశపడ్డారు. వితిక కోరిక తీరింది. ఇప్పుడు మహేష్‌ టైమొచ్చింది. తాజా ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్‌ కోసం తలపడిన బాబా భాస్కర్‌, మహేష్‌ విట్టాలలో మహేష్‌ని కెప్టెన్సీ పదవి వరించింది.

 

తనకు మద్దతు ఇవ్వమని కోరుతూ, ప్రచారం చేయాలనీ, ఎవరి ప్రచారమైతే నచ్చుతుందో వారి మెడలో పూల మాల వేసి తమ మద్దతు తెలియజేయాలని ఎవరి మెడలో ఎక్కువ మాలలు పడితే వారే ఇంటి కెప్టెన్‌ అనేది బిగ్‌బాస్‌ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్‌. అధికారం మనిషిలోని గుణాన్ని బయట పెడుతుందనే మహాత్మ గాంధీ మాటల్ని గుర్తు చేస్తూ, మనిషిలోని మార్పుకు అధికారం కారణమవుతుందనీ, ఆ మార్పు ఈ కెప్టెన్సీ ద్వారా నాలో నేను కోరుకుంటున్నాననీ ఇంటి సభ్యుల్ని తన మాటలతో ఇంప్రెస్‌ అయిన ఇంటి సభ్యులు మహేష్‌కి ఓ ఛాన్స్‌ ఇవ్వాలని వితిక, పునర్నవి తప్ప మిగిలిన హౌస్‌ మేట్స్‌ అంతా సపోర్ట్‌ చేసి, మహేష్‌ని కెప్టెన్‌గా ఎంచుకున్నారు.

 

నిజానికి మహేష్‌ తన మాటలతో ఇంటి సభ్యులనే కాదు, బిగ్‌బాస్‌ ఆడియన్స్‌ని కూడా ఇంప్రెస్‌ చేశాడు. మహేష్‌ మాట్లాడిన ఒక్కో మాట చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. ఆఫ్ట్రాల్‌ ఇంటి కెప్టెన్‌ అన్నట్లుగా కాకుండా, అదో గౌరవప్రదమైన పదవిగా భావించి, అదే ఫీలింగ్‌ చూస్తున్న ఆడియన్స్‌లో క్రియేట్‌ చేశాడు. ఇక కెప్టెన్‌గా హౌస్‌లో మహేష్‌ ఎలాంటి మార్పులు చేయనున్నాడో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS