కమెడియన్‌గా మహేష్ విట్టా చాలా కొద్ది మందికే తెలుసు. అయితే, ఆయన కామెడీ పంచ్ మాత్రం గుర్తుండిపోయేలానే ఉంటుందండోయ్. 'కృష్ణార్జున యుద్దం' సినిమాలో నానికి ఫ్రెండ్‌గా సపోర్టింగ్ రోల్ పోషించాడు మహేష్ విట్టా. ఈయన ప్రస్తుతం బిగ్‌బాస్ షోలో సందడి చేస్తున్నాడు. గత రెండు రోజులుగా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న బిగ్‌బాస్ షోలో తొలి వారం నామినేషన్య్ తతంగం నడుస్తోంది. ఆల్రెడీ ఫస్ట్ డేనే బిగ్‌బాస్ కొందరి పేర్లు నామినేట్ చేశారు.
ఆ నామినేషన్స్‌ని రెండోరోజు మిగిలిన హౌస్‌మేట్స్‌తో రీప్లేస్ చేసే ఛాన్స్ ఇచ్చారు. అలా రీప్లేస్ చేసే క్రమంతో ముందుగా నామినేట్ అయిన జాఫర్ తన ఎలిమినేషన్‌ని మహేష్‌తో రీప్లేస్ చేయాలనుకున్నాడు. అందుకు కారణం చెబుతూ, 'మహేష్‌తో పోల్చితే తాను బెటర్ పర్‌ఫామెన్స్ ఇవ్వగలననుకుంటున్నా, బిగ్‌బాస్‌లో కొనసాగడానికి నేను ఫిట్, సో మహేష్‌ని నామినేట్ చేస్తున్నా..' అనే కారణం చెప్పాడు.
అందుకు మహేష్ తన వెర్షన్‌లో జాఫర్‌కి సమాధానమిచ్చాడు. గేమ్‌లో ఎలాంటి యాక్టివిటీస్ చేయడానికైనా నేను సిద్ధమే. బిగ్‌బాస్‌లో ఛాన్స్ దక్కించుకున్నప్పుడే ఎంతటి కష్టాన్నైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నా. బిగ్‌బాస్ కోసం ఎలాంటి ఫీట్లు చేయడానికైనా నేను తోపే..' అంటూ జాఫర్‌కి బిగ్ పంచ్ ఇచ్చి సేఫ్ జోన్‌లోకి వచ్చేశాడు మహేష్. నాగార్జున, మహేష్‌కి ముందే కాంప్లిమెంట్ ఇచ్చాడు. పంచె బాగా కట్టావ్.. పంచెలు కూడా బాగా వేస్తావట కదా.. అని అలా బిగ్‌హౌస్‌లో మహేష్ నోట తొలి పంచ్ పోలా.. అదిరిపోలా.!