మహేష్‌ విట్టా ఎమోషనల్‌ పర్‌ఫామెన్స్‌.

మరిన్ని వార్తలు

మహేష్‌లో మంచి నటుడున్నాడు. మంచి గేమ్‌ ప్లానర్‌ ఉన్నాడు.. అలాగే మంచి రైటర్‌ కూడా ఉన్నాడు. బిగ్‌బాస్‌ ఇచ్చిన టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకునే టాస్క్‌లో భాగంగా, ఇన్ని రోజులుగా తాను బిగ్‌ హౌస్‌లో చేసిన ప్రయాణాన్ని, తాను అనుభవించిన పెయిన్‌ని ఆధారంగా చేసుకుని, దాన్ని బిగ్‌బాస్‌కి కనెక్ట్‌ చేసి మెసేజ్‌తో కూడిన సోలో స్కిట్‌ చేశాడు. వీక్షకుల మనసుల్ని గెలిచాడు. హౌస్‌మేట్స్‌లో కొందరి మనసుల్ని కూడా గెలిచాడు.

 

కానీ, మరికొందరిలో ఈగో రగిల్చాడు. డే వన్‌లోనే వరుణ్‌, వితికలు మహేష్‌తో ప్రవర్తించిన తీరు, భాష వల్ల జరిగిన చిన్న పొరపాటు.. ('పో..' అనే మాట వల్ల జరిగిన రచ్చ) నుండి స్టార్ట్‌ చేసి, లేటెస్ట్‌ వీకెండ్‌లో నాగ్‌ మాస్క్‌లు తీసేయండి.. అంటూ తమలోని యాక్టింగ్‌ని పక్కన పెట్టేసి, ఒరిజినాలిటీని బయటికి తీసుకురండి.. అన్న దాకా మహేష్‌ తన స్కిట్‌ పర్‌ఫామెన్స్‌లో చూపించాడు. అక్కడే నాగార్జున మహేష్‌కిచ్చిన అగ్గిపుల్ల అవార్డ్‌ ప్రస్థావన కూడా తీసుకొచ్చాడు.

 

'ఏయ్‌ పుల్లలు పెట్టక్‌..' అనే మాటకు తానెంత బాధ అనుభవించాడో.. ఆ పెయిన్‌ అంతా స్కిట్‌లో తన పర్‌ఫామెన్స్‌ ద్వారా చూపించాడు. అలా ఈ టాలెంట్‌ టాస్క్‌లో మహేష్‌ ఎమోషనల్‌ స్కిట్‌ అందర్నీ ఆకట్టుకుంది. ఫోన్లు లేకుండా, టైమ్‌ తెలియకుండా, సాంకేతికతకు దూరంగా ఉండి కూడా మనిషి బతకగలడు.. అనే అంశం ఈ షో ద్వారా ప్రూవ్‌ అవుతుంది. మనమేంటో మనం తెలుసుకోవడానికి బిగ్‌బాస్‌ అనేది ఓ బెస్ట్‌ ప్లాట్‌ఫామ్‌.. అని చెబుతూ, స్కిట్‌ చివరిలో బిగ్‌బాస్‌ని మనిషికి అంతరాత్మగా అభివర్ణించాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS