శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన `తిప్పరా మీసం` ఈ శుక్రవారమే విడుదలైంది. తొలి షోకే ఫ్లాప్ టాక్ మూగట్టుకుంది. ఈ సినిమాలో విషయం లేదని విమర్శకులు తేల్చేశారు. దాంతో ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. బూతు సినిమా ఏడు చేపల కథకు ఉన్న వసూళ్లు కూడా ఈ సినిమాకు లేవంటే నమ్మాల్సిందే. దాంతో నిర్మాతలు భారీ నష్టాల్ని భరించాల్సివస్తోంది. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ సినిమాపై పడింది. కల్యాణ్ దేవ్ నటిస్తున్న రెండో చిత్రం `సూపర్ మచ్చీ`.
ఈ దీపావళికి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందని టాక్. `తిప్పరా మీసం` నిర్మాతలే `సూపర్ మచ్చీ`నీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ముందు `తిప్పరా మీసం `నష్టాల్ని తీర్చాలి. ఆ తరవాతే `సూపర్ మచ్చీ` పట్టాలెక్కుతుంది. ఇప్పటి వరకూ 40 శాతం చిత్రీకరణ జరుపుకుంది. ఇకమీదట షూటింగ్ జరగాలంటే.. చేతికి పైకం అందాల్సిందే. అప్పటి వరకూ సూపర్ మచ్చీ షూటింగ్ లేనట్టే.